ప్రభాస్‌కు విలన్‌గా కన్నడ స్టార్‌..

154
Prabhas Salaar
- Advertisement -

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సలార్’. చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రస్తుతం హీరో, హీరోయిన్ల మధ్య సీన్స్ ను ప్రశాంత్ చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమాలో విలన్ పాత్ర ఎవరిని వరిస్తుందోనని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తుండగా, తాజాగా, ఆ సినిమాలో విలన్ ను తానేనని కన్నడ నటుడు మధూ గురుస్వామి స్పష్టం చేయడంతో సస్పెన్స్ తొలగిపోయింది.

ఈ సినిమాలో తాను భాగస్వామ్యం అయ్యాయని, ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రంలో తనకు అవకాశం రావడం గర్వంగా ఉందని మధూ గురుస్వామి తన సోషల్ మీడియాలో తెలిపారు. ఇది తనకెంతో ఆనందకరమైన విషయమని, తన అభిమానులకు ఈ విషయాన్ని పంచుకోవాలనే విషయాన్ని తెలియజేస్తున్నానని, ఇంత సువర్ణ అవకాశాన్ని ఇచ్చిన ప్రశాంత్ నీల్, నిర్మాతలకు కృతజ్ఞతలని ఆయన తెలిపారు.

- Advertisement -