సీఎం కేసీఆర్ ఇవాళ ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. రైతుల్లో ధైర్యం నింపనున్నారు. రాష్ట్రంలో వారం రోజులుగా అకాల వర్షాలు కురుస్తుండటంతో భారీ స్ధాయిలో నష్టం జరిగింది. ఇప్పటికే పంట నష్టపోయిన వివరాలను సీఎంకు అందించారు అధికారులు.
భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రామడుగు, చొప్పదండి, గంగాధర మండలాల్లో గురువారం సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. బాధిత రైతులను ఓదార్చనున్నారు. వరంగల్ జిల్లాలో జిల్లాలోని దుగ్గొండి మండలం అడవిరంగాపురంతో పాటు పరిసర గ్రామాల్లో వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు.
మహబూబాబాద్ జిల్లాలో జిల్లాలోని పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాకు సీఎం కేసీఆర్ రానున్నారు. వడగండ్లవానతో ఇక్కడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నష్టపోయిన పంటలను పరిశీలించి రైతుల్లో మనోధైర్యం కల్పించేందుకు సీఎం కేసీఆర్ ఈ ప్రాంతంలో పర్యటించనున్నారు.అలాగే ఖమ్మం జిల్లాలోని రామాపురంతో పాటు గార్లపాడు, గోవిందాపురం, లక్ష్మీపురం, రావినూతల, ముష్టికుంట్ల గ్రామాల్లో పర్యటించనున్నారు సీఎం. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో సీఎం సమీక్షించనున్నారు.
ఇవి కూడా చదవండి..