KCR:సత్తుపల్లిలో 80 వేల మెజార్టీతో గెలుస్తాం

31
- Advertisement -

సత్తుపల్లిలో బీఆర్ఎస్ 70 వేల నుండి 80 వేల మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు సీఎం కేసీఆర్. సత్తుపల్లి ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్…ఈ సభతో సండ్ర వెంకటవీరయ్య గెలుపు ఖాయమైందన్నారు. ఈసారి జరిగే ఎన్నికల్లో వ్యక్తులతో పాటు వారి వెనుక ఉన్న పార్టీలను చూడాలన్నారు. ఈ దేశంలో దళిత బంధు అనే పదాన్ని పుట్టించిందే సీఎం కేసీఆర్ అన్నారు.

ఓట్ల కోసం పెట్టింది దళిత బంధు పథకం కాదు అన్నారు. ఈ పథకం తేవాలని ఎవరు తనని అడగలేదన్నారు. 75 ఏళ్ల క్రితం స్వతంత్ర్యం వస్తే దళితలు ఇప్పటికి అణచివేతకు గురవుతున్నారన్నారు. ఎందుకు దళిత జాతి ఎందుకు వెనుకబడాలన్నారు. ఇప్పటివరకు దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై ఇంకా దురాగతాలు జరుగుతున్నాయన్నారు. సిద్దిపేటలో ఆనాడే దళిత చైతన్య జ్యోతి అనే కార్యక్రమాన్ని తెచ్చామన్నారు.

ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టని స్కీంలే చాలా ఉన్నాయన్నారు. తెలంగాణ ఆదాయం పెరుగుతున్న కొద్ది కొత్త కొత్త పథకాలను తీసుకొచ్చామన్నారు. కేసీఆర్ ఏ పథకం తీసుకొచ్చిన ఎన్నికల కోసం కాదన్నారు. ఎన్నికలకు సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. ఆరు నూరైన ఈ రాష్ట్రంలో గెలిచేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. ఈ సందర్భంగా పొంగులేటిపై విమర్శలు గుప్పించారు. అహంకారంతో కొంతమంది మాట్లాడే మాటలు అర్ధం చేసుకోని కర్రుకాల్చి వాతపెట్టాలన్నారు. ఖమ్మం జిల్లా చైతన్యం కలిగిన జిల్లా అని ఈ డబ్బు రాజకీయాలను తిప్పికొట్టాలన్నారు.గడియారాలు,మందు సీసాలు పంచుడు ఇదా రాజకీయం అన్నారు.

Also Read:నవంబర్ 24న.. ‘ఆదికేశవ’

ఈ రాష్ట్రాన్ని ఎక్కువకాలం పాలించింది కాంగ్రెస్‌ పార్టీ కానీ ప్రజలకు చేసింది గుండు సున్న అన్నారు. ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించాలని ఎవరు ఏం చేశారో గుర్తు తెచ్చుకోవాలన్నారు. సత్తుపల్లిలో వెంకటవీరయ్యకు మంచి పేరు ఉందని ఎవరు ఫోన్ చేసినా వెంటనే అక్కడ వాలిపోతారన్నారు.ప్రజల మనిషి సండ్ర వెంకటవీరయ్య అనే పేరు ఉందన్నారు.

- Advertisement -