CM KCR:ధరణితో భూసమస్యలకు చెక్

46
- Advertisement -

ధరణితో భూ సమస్యలకు పరిష్కారం లభించిందన్నారు సీఎం కేసీఆర్. నిర్మ‌ల్ జిల్లా క‌లెక్ట‌రేట్‌, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభోత్స‌వం అనంత‌రం ఎల్ల‌పెల్లిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొని ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

ఇవాళ నిర్మ‌ల్ జిల్లా ఏర్పాటు చేసుకున్న త‌ర్వాత బ్ర‌హ్మాండంగా నిర్మ‌ల్ క‌లెక్ట‌రేట్ నిర్మాణం చేసుకున్నాం. క‌లెక్ట‌రేట్‌ను ప్రారంభించాం. సంతోషంగా ఉంది. నిర్మ‌ల్ జిల్లాలో 396 గ్రామ‌పంచాయ‌తీలు ఉన్నాయి. ఈ పంచాయ‌తీల‌కు కూడా ప్ర‌త్యేకంగా రూ. 10 ల‌క్ష‌ల చొప్పున నిధులు ఇస్తున్నాం. అదే విధంగా నిర్మ‌ల్, ముథోల్, ఖానాపూర్ మున్సిపాలిటీల‌కు రూ. 25 కోట్ల చొప్పున ప్ర‌క‌టిస్తున్నాం. ఇవి కాకుండా నిర్మ‌ల్ జిల్లాలో 19 మండ‌ల కేంద్రాల‌కు రూ. 20 ల‌క్ష‌ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నాం అని కేసీఆర్ ప్ర‌క‌టించారు.

Also Read:అన్నీ స్థానాల్లోనూ బి‌ఆర్‌ఎస్ హవా !

ఇటీవల విడుద‌లై ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో మొత్తం తెలంగాణ‌లోనే నిర్మ‌ల్ జిల్లా నంబ‌ర్ వ‌న్‌గా నిలిచింద‌ని కేసీఆర్ తెలిపారు. నిర్మ‌ల్ జిల్లా టీచ‌ర్ల‌ను, విద్యార్థుల‌ను హృద‌య‌పూర్వ‌కంగా అభినందిస్తున్నాను. బాస‌ర‌ స‌ర‌స్వ‌తి అమ్మ‌వారి ఆల‌యాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకోబోతున్నాం. రాబోయే రోజుల్లో పునాది రాయి కోసం రాబోతున్నాం. అద్భుత ఆల‌యం నిర్మించుకుందాం అని కేసీఆర్ పేర్కొన్నారు. ఒక‌నాడు మారుమూల జిల్లా, అడ‌వి జిల్లా అని పేరున్న ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. కొత్తగా మూడు మెడిక‌ల్ కాలేజీలు వ‌చ్చాయి. మ‌న ప్ర‌భుత్వం ప్రారంభించిన‌టువంటి పేద‌ల కోసం నిర్మించే 2 వేల డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌కు శంక‌స్థాపనం చేశాం. పేద‌వాళ్ల‌ను ఆదుకోవాల‌నే ఉద్దేశంతో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నాం అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

ఎవరైతే ధరిణి బంగాళాఖాతం వేస్తామన్నా.. ఆ దుర్మార్గులనే బంగాళాఖాతంలో విసిరేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తీరుపై ధ్వజమెత్తారు. ‘గతంలో రెవెన్యూ శాఖలో భయంకరమైన దోపిడీ జరిగేది. ఎవరి భూమి ఎవరి చేతుల్లో ఉండేదో తెలిసేది కాదు. నిన్న ఉన్న భూమి తెల్లవారే సరికి పహనీలు మారిపోయేవి. ఈ మధ్య కాంగ్రెస్‌ నేతలు ధరణి పోర్టల్‌ను తీసి బంగాళాఖాతంలో విసిరేస్తామంటున్నారు. మళ్లీ పైరవీకారులు రావాలి. వీఆర్వోలు రావాలి. రైతుబంధు ఏ విధంగా వస్తుంది. హైదరాబాద్‌లో ప్రభుత్వం బ్యాంకులో వేస్తే.. బ్యాంకు నుంచి మీకు మెస్సేజ్‌లు వస్తున్నయ్‌. రైతు చనిపోతే ఏవిధంగా రైతుబీమా వస్తుంది. ఎవరూ మాట్లాడకుండా, దరఖాస్తు ఇవ్వకుండానే, ఆఫీసులకు వెళ్లకుండా ఎనిమిదిరోజుల్లోనే రూ.5లక్షల వారి ఇంటికి వస్తుంది. అదేవిధంగా ప్రభుత్వమే వడ్లు కొనుగోలు చేస్తే.. డబ్బులు ఖాతాల్లో జమ చేస్తున్నాం’ అని తెలిపారు.

Also Read:పొంగులేటికి గుణపాఠం తప్పదా ?

గతంలో చాలా బాధలుపడేది. బీటీకి, మార్కెట్‌యార్కెట్‌, అంగడికి పోయిది. రోజుల తరబడి పడావ్‌పడేది. ఎవరి ఊరిలో వారు అమ్ముకునేలా 7వేల కేంద్రాలు ఏర్పాటు చేసి.. కొన్న వడ్ల డబ్బులు బ్యాంకుల వేస్తే.. ఖాతాల్లోకి వస్తున్నాయి. ధరణి పోర్టల్‌ తీసి వేస్తే ఇవన్నీ జరుగుతాయా? మరి ధరణి ఉండాలా? లేదా? ఎవరైతే ధరిణి బంగాళాఖాతం వేయమన్నారో వారిని బంగాళాఖాతంలో విసిరేయాలి. ఎవరైతే వీఆర్వోలు, పట్వారీలు, పరేషన్‌ చేయడానికి, భూములు గోల్‌మాల్‌ చేసేందుకు ఎవరైతే దుర్మార్గం చేస్తున్నారు. ఇటీవల మహారాష్ట్రకు వెళ్తే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. వడ్లు కొన్న డబ్బులు ఖాతాల్లో వేస్తారా? చచ్చిపోతే బ్యాంకులోకి వస్తాయా? రైతుబంధు సైతం బ్యాంకులకు వస్తదా? అని ఆశ్చర్యపోతున్నారు. మళ్లీ పాత పరిపాలన, కాంగ్రెస్‌ పరిపాలన చూడలేదా? వీఆర్వోల దోపిడీ, పహనీలు మార్చేయడం, భూమి రికార్డులు మార్చేడం చూడలేదా? ఇవాళ రిజిస్ట్రేషన్‌ కావాలంటే 15 నిమిషాల్లో అయిపోతుంది. పట్టా కావాలంటే 10 నిమిషాల్లో అవుతుంది. ధరణి తీసివేస్తే మళ్లీ ఎన్ని రోజులు తిరగాలి? ఎన్ని దరఖాస్తులు పెట్టాలి? అందరు నాకు గట్టిగా చెప్పాలి. ధరణి ఉండాలా? తీసివేయాలా? అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు.

మిమ్మల్ని ఒక్కటే కోరుతున్నా. ఈ దుర్మార్గులు 50సంవత్సరాలు, రాష్ట్రాన్ని పరిపాలించి మంచినీళ్లు కూడా ఇవ్వలే. ఇవాళ ప్రతి ఇంట్లో నల్లా బిగించి మంచినీళ్లు తెచ్చుకుంటున్నాం. ఎస్సారెస్పీ ఎండిపోకుండా శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవ పథకాన్ని పెట్టుకున్నాం. కోట్ల టన్నుల ధాన్యం పండించుకున్నాం. రాష్ట్రం ఇలాగే ఉండాలంటే మీ అందరి మద్దతు, ఆశీస్సులు బీఆర్‌ఎస్‌ పార్టీకి ఉండాలి. మీ మద్దతు మరింత ముందుకుపోవాల్సిన అవసరం ఉంది. రాబోయే టర్మ్‌లో ఎన్నికలు పూర్తయ్యాక ఇవాళ ఉన్న పద్ధతి కాకుండా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ చేసి రైతుకు ఎక్కువ డబ్బులు వచ్చేలా మార్కెట్‌కు పంపేలా కొత్త ప్రణాళికలు ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఏ తాలూకాకు ఇబ్బడిముబ్బడిగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు పెట్టి యువకులందరికీ అక్కడే ఉద్యోగాలు దొరికే పరిస్థితులు తెస్తున్నాం అన్నారు.

- Advertisement -