Harishrao:వెలుగుల దీపావళి కావాలా?.కర్ణాటక చీకటి కావాలా?

38
- Advertisement -

రాహుల్ గాంధీ ఆరు గ్యారంటీ అంటూ తెలంగాణ ప్రజలను మోసం చేయటానికి వస్తున్నారన్నారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన హరీష్‌..కర్ణాటక లో ఇచ్చిన హామీలే అమలు కావడం లేదు అన్నారు. కర్ణాటక లో ఓటేసిన ప్రజలకు పథకాలు అందటం లేదని…కర్ణాటక ప్రజలు ఏది అడిగినా ఖజానా ఖాళీ అయ్యింది అని అక్కడ సీఎం చెప్తున్నారన్నారు. అయిదు గ్యారంటీ లని చెప్పిన కాంగ్రెస్ ప్రజలకు రాం రాం చెప్పారరన్నారు. ఎన్నికలప్పుడు ఓడ మల్లప్ప ,ఎన్నికలు ముగియగానే బోడ మల్లప్ప అన్నట్టుగా ఉన్నది రాహుల్ గాంధి తీరు ఉందన్నారు.

కర్ణాటక లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరునెలలు పూర్తవుతుంది…కర్ణాటక ఎన్నికలపుడు గ్యారంటీల ప్రారంభానికి కాలపరిమితి పెట్టిన రాహుల్ గాంధీ ఇపుడు రకరకాల షరతులను పెడుతూ ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్నారన్నారు. విద్యార్థుల స్కాలర్ షిప్ లు ఇవ్వటం లేదని…కొత్త ఉద్యోగాలు ఇవ్వడం లేదు అన్నారు. స్కాలర్ షిప్ లు ఇవ్వకుండా కోత పెట్టీ కార్మికుల పిల్లల చదువుకు దూరం చేస్తోందని..తెలంగాణ లో కాంగ్రెస్ రంగు రంగుల ప్రపంచం చూపుతోందన్నారు.

కర్ణాటక ప్రజా ప్రతినిదుల్లో అసహనం వ్యక్తం అవుతోందని…అభివృద్ది నిధులు ఇవ్వకపోతే జనాల్లోకి ఎలా వెళ్ళాలని అక్కడి ఎమ్మెల్యేలు అడుగుతున్నారన్నారు. వెలుగుల దీపావళి కావాలా? కర్ణాటక లాంటి చీకటి కావాలా? ఆలోచించాలన్నారు. ఆరు నెలల్లో అక్కడ 357 మంది కర్ణాటక రైతులు ఆత్మహత్య చేసుకున్నారు…కానీ తెలంగాణ లో రైతు ఆత్మహత్యకు తగ్గాయన్నారు. తెలంగాణలో మేము రైతులం అని గర్వంగా చెప్పుకుంటున్నారని…గెలిచే దాకా ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటారు., ఆ తర్వాత excuse me please అంటారన్నారు. ఒక్క ఛాన్స్ అంటున్న కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలని…కర్ణాటక పరిస్థితి తెలంగాణ కు కావాలా? ఆలోచించాలన్నారు. కర్ణాటక ఫెయిల్ మోడల్ చెప్పి ఇక్కడ ఓట్లు అడగాలని రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. అమరవీరుల త్యాగాలను కించ పర్చెలా చిదంబరం వాఖ్యలు ఉన్నాయని…బేషరతుగా చిదంబరం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read:MLC Kavitha:జై తెలంగాణ ఎందుకు అనరు?

- Advertisement -