CM KCR:రైతు బంధు సృష్టించిందే బీఆర్ఎస్

56
- Advertisement -

రైతు బంధును సృష్టించిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు సీఎం కేసీఆర్. జుక్కల్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడోసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఎన్నికలు రాగానే అనేక పార్టీలు వస్తాయి…అనేక మాటలు చెబుతాయి కానీ ప్రజలు ఎవరు ఏం చేశారో ఆలోచించాలన్నారు. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో బ్రాహ్మాస్తం లాంటిదని దానిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

తెలంగాణ వచ్చిన తర్వాత జుక్కల్ అభివృద్ధి మీ కళ్ల ముందే ఉందన్నారు. తెలంగాణ వచ్చిన వెంటనే మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసుకున్నామని, కాళేశ్వరంతో సాగు నీరు అందిందన్నారు. నిజాం సాగర్‌ని సమైక్య పాలకులు ఎండబెట్టారని ఇది ప్రపంచానికి తెలియాలని ఉద్యమ సమయంలో అక్కడే మీటింగ్ పెట్టుకున్నామన్నారు. 2004లోనే తెలంగాణ వస్తే అభివృద్ధిలో ఇంకా ముందుండే వారమని చెప్పారు.

తెలంగాణ వచ్చాక 10 సంవత్సరాలు అవిశ్రాంతంగా శ్రమించి అనేక సమస్యలను పరిష్కరించామన్నారు. మిషన్ భగీరథ ద్వారా మంచినీటి కరువు లేకుండా పోయిందన్నారు. పేదలకు పెన్షన్లు, రైతులకు రైతు బంధు ఇస్తున్నామన్నారు. మంచి చెడు ఆలోచించి ఓటు వేయాలన్నారు. స్ధానిక ఎమ్మెల్యే షిండే మంచి మనిషి అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే షిండేను మరోసారి గెలిపించాలన్నారు.

Also Read:ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం

తన దగ్గరికి ఎప్పుడు వచ్చిన ప్రజా సమస్యల గురించే చెప్పేవారన్నారు. ఎంపీ బీబీ పాటిల్ అద్భుతంగా పనిచేశారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. జుక్కల్ అంటే త్రివేణి సంగమం అన్నారు. మన పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో గమనించాలన్నారు. రైతులు ఆత్మహత్యలతో అల్లాడుతున్నారన్నారు. మహారాష్ట్రలో రోజుకు 8 నుండి 10 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. కర్ణాటలో 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి ఓట్లు వేశాక తీరా 5 గంటల కరెంటే ఇస్తున్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల కరెంట్ సదుపాయం లేదన్నారు. రైతు బంధు వేస్ట్ అన్న కాంగ్రెస్‌ని బంగాళా ఖాతంలో కలపాలన్నారు.

- Advertisement -