‘దేవర’ పై క్రేజీ గాసిప్స్

28
- Advertisement -

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమా పై ప్రస్తుతం క్రేజీ గాసిప్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో జాన్వీ పాత్ర‌కు రెండు షేడ్స్ ఉంటాయ‌ని, సెకండాఫ్‌లో జాన్వీ క‌పూర్ రోల్ చాలా కొత్త‌గా ఉంటుంద‌ని, ఆ సీన్స్‌లో ఆమె నెగిటివ్ రోల్‌లో క‌నిపించ‌నుంద‌ని తెలుస్తోంది. ఇందులో నిజ‌మెంతన్న‌ది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ అక్క క్యారెక్టర్ కోసం మంచు లక్ష్మిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

దేవర సినిమాలో ఎన్టీఆర్ అక్క క్యారెక్టర్ చాలా కీలకమని, ఇందుకు మంచు లక్ష్మి కరెక్ట్ గా సరిపోతుందని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త కానీ నిజమైతే కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న లక్ష్మికి మరిన్ని ఛాన్సులు వచ్చే అవకాశం ఉంది. పైగా ఎన్టీఆర్‎కు అక్కగా మంచు అక్క అంటే.. ఆ కిక్కే వేరు అంటున్నారు నెటిజన్లు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం మంచు అక్క బదులు, మరో నటిని ఈ పాత్రలో ఎంపిక చేస్తే బాగుండు అంటూ కొరటాల శివకు సోషల్ మీడియాలో మెసేజ్ లు చేస్తున్నారు. పాపం, మంచు అక్కకు ఛాన్స్ ఇవ్వొద్దు అని తారక్ ఫ్యాన్స్ డైరెక్ట్ గానే మెసేజ్ లు చేస్తున్నారు.

Also Read:ఓటీటీ : ఈ వారం చిత్రాలివే

అన్నట్టు పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతున్న దేవర సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. దేవ‌ర సినిమాలో సీనియ‌ర్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ ఓ కీల‌క పాత్ర చేస్తుంద‌ని, న‌వంబ‌ర్ నుంచి దేవ‌ర‌కు ర‌మ్య‌కృష్ణ డేట్స్ అడ్జ‌స్ట్ చేసింద‌ని స‌మాచారం. ఇంతకీ రమ్యకృష్ణ పాత్ర ఏమిటో తెలుసా ?, ఓ వేశ్యగా ఆమె నటిస్తోందట. విలన్ సైఫ్ అలీఖాన్ సరసన రమ్యకృష్ణ పాత్ర సాగుతుందట.

Also Read:బీజేపీలో భయం మొదలైందా?

- Advertisement -