సింగరేణి కార్మికులకు సమస్యలన్నీ పరిష్కరిస్తాం..

392
cm kcr
- Advertisement -

సింగరేణి కార్మికులకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. సింగరేణి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలతో త్వరలోనే ప్రత్యేకంగా సమావేశమై అన్ని విషయాలు చర్చించి, పరిష్కార మార్గాలు సూచించాలని సింగరేణి సిఎండి శ్రీధర్ ను సిఎం ఆదేశించారు.

అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గండ్ర వెంకట రమణారెడ్డి, దివాకర్ రావు, వనమా వెంకటేశ్వర్లు, దుర్గం చిన్నయ్య, సండ్ర వెంకటవీరయ్య, రేగ కాంతారావు, హరిప్రియ తదితరులతో సమావేశమయ్యారు. సింగరేణి సిఎండి ఎన్.శ్రీధర్, సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సింగరేణి ప్రాంతంలోని సమస్యలను ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి వివరించారు. సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని సిఎం హామీ ఇచ్చారు. ప్రతీ ఏడాది మాదిరిగానే 2018-19 ఆర్థిక సంవత్సరంలో సింగరేణికి వచ్చిన లాభాల్లో కార్మికులకు వాటా ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరారు. దీనికి సిఎం సానుకూలంగా స్పందించారు. గురువారం అసెంబ్లీలో సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా చెల్లించే అంశాన్ని ప్రకటిస్తానని సిఎం హామీ ఇచ్చారు.

- Advertisement -