జిల్లా అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష..

481
harish rao
- Advertisement -

సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. అంతగిరి-అన్నపూర్ణ, రంగనాయక, మల్లన్న, కొండ పోచమ్మ జలాశయాలు, సంగారెడ్డి, తుర్కపల్లి, ఎం.తుర్కపల్లి, రామాయంపేట, గజ్వేల్, కిష్టాపూర్, ఉప్పర్ పల్లి కెనాల్స్, జలాశయాల నిర్మాణాల్లో భాగంగా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, కాల్వల భూ సేకరణ అంశాలపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో సిద్ధిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, జాయింట్ కలెక్టర్ పద్మాకర్, ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరిరామ్‌లు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో మంత్రి హరిష్‌ రావు మాట్లాడుతూ.. అన్నపూర్ణ సాగర్‌లో ముంపునకు గురయ్యే కొచ్చగుట్టాయపల్లి గ్రామానికి లింగారెడ్డి పల్లిలో నిర్మించిన ఆర్అండ్ఆర్ కాలనీ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశించారు. జలాశయాల నిర్మాణాల్లో భాగంగా ఆర్అండ్ఆర్ కాలనీలకు మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని, అసంపూర్తి నిర్మాణ పనులన్నీ తొందరగా పూర్తి చేసి ఆర్అండ్ఆర్ కాలనీల గృహా ప్రవేశాలకు సిద్ధం చేయాలని అధికారిక వర్గాలకు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -