కేంద్రం ప్యాకేజీ అంకెల గారడీ: సీఎం కేసీఆర్‌

243
CM KCR Slams Central Government
- Advertisement -

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను ఈ నెల 31 వరకు పొడిగించిన నేపథ్యంలో తెలంగాణలోనూ లాక్ డౌన్ పై ప్రకటన చేశారు. ఈ నెలాఖరు వరకు రాష్ట్రంలోనూ లాక్ డౌన్ అమల్లో ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక కేంద్రం ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీపై సీఎం విమర్శలు గుప్పించారు. కరోనా సమయంలో కేంద్రప్రభుత్వం 20 లక్షల కోట్ల రూపాయల పేరుతో ప్రకటించిన ప్యాకేజీ బోగస్‌ అని సీఎం కేసీఆర్‌ కొట్టిపారేశారు. కేంద్రం ప్యాకేజీ అంకెల గారడీ అని అంతర్జాతీయ పత్రికలే చెబుతున్నాయి. కేంద్రం ప్రకటించిన దాన్ని ప్యాకేజీ అంటారా ఎవరైనా అని సీఎం ఎద్దేవా చేశారు.

ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచుతూ దరిద్రపు ఆంక్షలు పెట్టారని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. కేంద్ర ప్యాకేజీ దగా, మోసమన్నారు. ఆర్థికంగా నిర్వీర్యమైన సమయంలో రాష్ట్రాలను భిక్షగాళ్లను చేస్తారా..అని సీఎం కేసీఆర్‌ కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో కేంద్రం తీరు జనాలకు తెలియకుండా ఉండదని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు.

- Advertisement -