అభ్యుదయవాది…రామలింగారెడ్డి: సీఎం కేసీఆర్

85
cm kcr

రామలింగారెడ్డి ఎమ్మెల్యే కాకముందే ఆయనతో తనకు అనుబంధం ఉందని తెలిపారు సీఎం కేసీఆర్. రామలింగారెడ్డి మృతిపట్ల అసెంబ్లీలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం…రామ‌లింగారెడ్డి నిరాడంబ‌ర నాయ‌కుడు అని కొనియాడారు.

సామాన్య రైతు కుటుంబంలో జ‌న్మింనిచిన సోలిపేట రామ‌లింగారెడ్డి.. విద్యార్థి ద‌శ నుంచే ప్ర‌జా ఉద్య‌మాల వైపు ఆక‌ర్షితుల‌య్యారు. మెద‌క్ జిల్లాలో జ‌రిగిన ఉద్య‌మాల‌కు బాస‌ట‌గా నిలిచారు. జ‌ర్న‌లిస్టుగా ఆయ‌న‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది. జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారాల‌ కోసం అనేక రాజీ లేని పోరాటాలు నిర్వ‌హించారని తెలిపారు.తాను న‌మ్మిన ఆద‌ర్శాల‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్టిన అభ్యుద‌య‌వాది. వ‌ర‌క‌ట్నం లేకుండా పెళ్లి చేసుకున్నారు. కాళోజీ, త‌న చేతుల మీదుగా ఆద‌ర్శ వివాహం జ‌రిగింది. అదే విధంగా త‌న పిల్ల‌ల‌కు కూడా వివాహాలు జ‌రిపించారని తెలిపారు.

తెలంగాణ ఉద్య‌మంలో చురుకైన పాత్ర పోషించారు. స‌మైక్య‌వాదులు క‌ల్పించే ప్ర‌లోభాల‌కు లొంగ‌కుండా తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క‌పాత్ర పోషించారు. ఉద్య‌మ ప్ర‌యోజ‌నాల కోసం ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు సిద్ధ‌ప‌డ్డారని తెలిపారు. ఆగ‌స్టు 6న తుదిశ్వాస విడిచారు…ఆయన మృతిపట్ల సభ సంతాపం తెలుపుతోందన్నారు.