నేడు హుజుర్ నగర్ లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ

353
Byeletions-huzurnagar

ఈనెల 21న హుజుర్ నగర్ అసెంబ్లీ స్ధానానికి ఉప ఎన్నిక జరుగనున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధి ఏ పల్లెకు వెళ్లినా ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇక ఈరోజు హుజుర్ నగర్ లో భారీ బహిరంగ సభ జరుగనుంది. ఈ సభకు టీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు హుజూర్‌నగర్ పట్టణంలోని సాయిబాబా థియేటర్ రోడ్‌లో నిర్వహించే ఉప ఎన్నికల బహిరంగసభలో ఆయన పాల్గొంటారు.

సీఎం కేసీఆర్ సభకు నియోజకవర్గ ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం టీఆర్‌ఎస్ శ్రేణు లు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. మంత్రులు జీ జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, టీఆర్‌ఎస్ హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ఇంచార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ నాయకులు రోడ్‌షోలు, సభలు ఇంటింటి ప్రచారాలు నిర్వహిస్తున్నారు.