కేసీఆర్ పాన్‌ఇండియా లీడర్: జీవన్‌రెడ్డి

113
- Advertisement -


తెలంగాణ ప్రభుత్వంను కూల్చే ఆలోచన వచ్చిన బొంద పెడతామని హెచ్చరించారు ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి. బీజేపీ తెలంగాణలో ఒక చెల్లని రూపాయన్నారు. బీజేపీ దొంగల పార్టీ అని విరుచుపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. అసెంబ్లీలోని టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యలయంలో ఎమ్మెల్యే వివేకానందతో కలిసి జీవన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ పాన్‌ ఇండియా పొలిటికల్‌ సూపర్‌స్టార్‌ అని చెప్పారు. కేంద్రం ఏ వర్గానికి మేలు చేసిందో ప్రధాని మోదీ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇక్కడి వనరులపై మోదీ దృష్టి పెట్టారని విమర్శించారు.

తెలంగాణ అభివృద్ధిని చూసి మోదీ సహా బీజేపీ ముఖ్య నేతలు నేర్చుకోవాలని సూచించారు. ఈస్టిండియా కంపెనీ దేశాన్ని దోచుకున్నట్టు మోదీ ఆధ్వర్యంలోని నార్త్‌ ఇండియా కంపెనీ తెలంగాణను దోచుకోవడానికి వచ్చిందని చెప్పారు. మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ గుజరాత్‌కు వెళ్తే రిసీవ్‌ చేసుకోలేదని విమర్శించారు. రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ పని అని అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నించారు. ఎవరు అధికారంలో ఉండాలో ప్రజలే నిర్ణయిస్తారని వెల్లడించారు.


తెలంగాణపై బీజేపీ రాక్షసుల కన్ను పడిందన్నారు ఎమ్మెల్యే వివేకానంద. మోదీ కంటే ముందే సీఎం కేసీఆర్‌ రాజకీయాల్లో వచ్చారని చెప్పారు. తెలంగాణ సాధించి అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టిన నాయకుడు కేసీఆర్‌ అని, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొస్తున్న నాయకుడు మంత్రి కేటీఆర్‌ అని వెల్లడించారు. ఆర్థిక క్రమశిక్షణకు మారుపేరుగా తెలంగాణ నిలుస్తున్నదన్నారు.

- Advertisement -