సాహితీ యోధునికి సీఎం కేసీఆర్‌ నివాళి..

18
CM KCR

‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అనే దాశరథి స్ఫూర్తితో నేడు తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా అభివృద్ధి చేసుకున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. దాశరథి కృష్ణమాచార్య 97వ జయంతి సందర్భంగా సాహితీ యోధునికి ముఖ్యమంత్రి నివాళులర్పించారు. గజల్ రుబాయీల వంటి ఉర్ధూ, పార్శీ సాహిత్య సాంప్రదాయాలను తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టి తెలంగాణ గంగా జమునా తెహజీబ్‌కు వారధి కట్టిన అక్షర సారథి దాశరథి అని సీఎం కొనియాడారు.

దాశరథి యాదిలో ఆయన జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు. దాశరథి సాహితీ పురస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఏటా తెలంగాణ సాహితీ మూర్తులను నగదు పురస్కారాలతో సత్కరించుకుంటూ గౌరవించుకుంటున్నామని సీఎం కేసీఆర్‌ తెలిపారు.