కేటీఆర్‌ బర్త్‌డే సాంగ్‌ ఆవిష్కరణ..

119
KTR Birthday Song

టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు పురస్కరించుకొని మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న ఆధ్వర్యంలో రూపొందించబడిన ప్రత్యేక పాటను తెలంగాణ భవన్‌లో గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ కార్యాలయ కార్యదర్శి ఎం శ్రీనివాస్ రెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జోగు మహేందర్, కిషోర్ గౌడ్, ఈ పాట డైరెక్టర్ పూర్ణచందర్, నిర్మాత కోణతం లక్ష్మణ్, ప్రణయ్, సంగీత దర్శకుడు బాజీ, రచయిత మానుకోట ప్రసాద్, ఎడిటర్ వెంకీ తదితరులు పాల్గొన్నారు.