స్ధానిక సంస్ధల ఎన్నికల్లో అన్నీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్ధానాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధులు గెలిచేలా నాయకులు కృషి చేయాలన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్. జిల్లా, మండల పరిషత్ ఎన్నికల సరళిపై శనివారం కేసీఆర్ హైదరాబాద్‌లో అంతర్గత సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్ లో నిర్వహించిన ఈకార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పలువురు రాష్ట్ర స్దాయి నాయకులు పాల్గోన్నారు.
మొదటిదశ ఎన్నికల నుంచే అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సానుకూల పరిస్ధితులు ఉన్నాయని కొంచెం కష్టపడితే అన్నీ స్ధానాల్లోమ మనమే గెలుస్తామని తెలిపారు. 32 జెడ్సీ స్ధానాలు టీఆర్ఎస్ అభ్యర్దులే విజయం సాధించాలన్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో విపక్ష పార్టీలను చిత్తుచేసి టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలన్నారు.
మొదటి దశ ఎన్నికలకు 32 జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం చాలా బాగా చేశారన్నారు. శాసన సభ ఎన్నికల్లో ప్రజలు మనకు భారీ విజయాన్ని కట్టబెట్టారు.. అలాగే లోక్ సభ ఎన్నికల్లో కూడా 16స్ధానాల్లో గెలుస్తామని చెప్పారు. పంచాయితీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్దులే 90శాతం విజయం సాధించారని చెప్పారు. కొంచెం కష్టపడితే ఎంపీటీసీ, జెడ్సీటీసీలు కూడా మనమే గెలుచుకోవచ్చు అన్నారు.