“డిస్కోరాజా” మూవీ ఆగిపోవడానికి కారణం అదేనా?

168
disco-raja

మాస్ మహారాజ్ రవితేజ గత కొద్ది రోజులుగా సరైన హిట్లు లేక సతమతమవుతున్నారు. ఆయన నటించిన సినిమాలు వరుసగా పరాజయాలవుతున్నాయి. చివరగా ఆయన హిట్ కొట్టిన చిత్రం రాజా ది గ్రేట్. ఇక తాజాగా రవితేజ నటిస్తున్న చిత్రం డిస్కోరాజా. ప్రముఖ దర్శకుడు వీఐ ఆనంద్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైన ఈచిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఇటివలే మొదటి షెడ్యూల్ ను కూడా పూర్తీ చేసుకుంది.

అయితే మొదటి షెడ్యూల్ కొన్ని సీన్లు సరిగ్గా రాకపోవడంతో స్క్రీప్ట్ మారుద్దామని చెప్పాడట రవితేజ. అందుకు దర్శకుడు వీఐ ఆనంద్ ఒప్పుకోకపోవడంతో రవితేజకు కోపం వచ్చి షూటింగ్ కు రావడం లేదని తెలుస్తుంది. రవితేజకు నచ్చినట్టు వీఐ ఆనంద్ స్క్రీప్ట్ మారుస్తాడా లేదా సినిమా క్యాన్సల్ అవుతుందో చూడాలి మరి.

ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు రవితేజ. అందుకోసం సరైన స్క్రీప్ట్ వచ్చాకే సినిమా తీయనన్నట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు చిన్న దర్శకులు రవితేజ వద్దకు పరుగులు పెడుతున్నారట. ఆర్ఎక్స్ 100మూవీ దర్శకుడు అజయ్ భూపతి, సంపత నంది పలువురు రవితేజ కు కథలు వినిపించారట. చూడాలి మరి రవితేజ తర్వాతి మూవీ ఏవరితో ఉండనుందో..