సోమవారం సీఎం కేసీఆర్ త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. సతీసమేతంగా ఆయన శంషాబాద్‌లోని ముచ్చింతల్‌లో ఉన్న ఆశ్రమానికి వెళ్లారు. కేసీఆర్ దంపతులకు వేద పండితులు పూర్ణ కుంభాలతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను శాలువాలతో చినజీయర్ స్వామి సత్కరించి, వారిని ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా జీవ ప్రాంగణంలోని కుటీరంలో చినజీయర్ స్వామితో సమావేశమైన సీఎం కేసీఆర్.. భగవత్ రామానుజచార్య ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవం సందర్భంగా కుటీర ప్రాంగణంలో సీఎం కేసీఆర్ మొక్కలు నాటారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న ‘సమతామూర్తి’ విగ్రహావిష్కరించనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను చినజీయర్ స్వామి ఇప్పటికే ఆహ్వానించారు. చినజీయర్ ఆశ్రమంలోనే 216 అడుగుల ఎత్తైన పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.