- Advertisement -
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ తుది అంకానికి చేరుకుంది. ప్రచారానికి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో టీఆర్‌ఎస్ మరింత దూకుడును పెంచింది. ఇక ఇప్పటికే ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ వెనుకబడగా టీఆర్ఎస్‌కు మాత్రం ప్రజల నుండి మంచి స్పందనవస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ 3గంటలకు చండూరు మండలం బంగారిగడ్డలో సీఎం కేసీఆర్ సభ జరగనుంది.
చండూరు వేదికగా జరిగే బహిరంగ సభకు నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా జన సమీకరణకు టీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ సభలో సీఎం ఏం మాట్లాడుతారోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు ఎర అంశంపై సీఎం ఏ విధంగా స్పందిస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బీజేపీని ప్రజల ముందు దోషిగా నిలిపేలా సీఎం కేసీఆర్ ప్రసంగం సాగే అవకాశాలు ఉంటాయని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.
ఇవి కూడా చదవండి..
బండికి అధిష్టానం అక్షింతలు
సంక్రాంతి రేస్..సినిమాలు ఫిక్స్!
బండ్ల గణేష్ సంచలన నిర్ణయం
- Advertisement -