ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో తరగతులు ప్రారంభం..

128
cm
- Advertisement -

ఒకేసారి ఒకేసారి 8 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. హైదరబాద్‌ ప్రగతి భవన్ నుండి ఆన్‌లైన్‌లో తరగతులను ప్రారంభించారు సీఎం కేసీఆర్. కాలేజీలన్నీ రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులతో ఏర్పాటు అయ్యాయి.

ఈ కాలేజీలు అందుబాటులోకి రావడంతో ఈ ఏడాది అదనంగా 1,150 మందికి వైద్య విద్య అందనుంది. ఉమ్మడి పాలనలో 57 ఏండ్లలో మూడు కాలేజీలే ఉండగా సీఎం కేసీఆర్‌ పాలనలో 8 ఏండ్లలోనే 12 కాలేజీలు ఏర్పాటు అయ్యాయి.

వచ్చే ఏడాది 9, ఆ తర్వాత ఏడాది మరో 8 కాలేజీల ఏర్పాటు కానున్నాయి. ఎనిమిదేండ్లలోనే 12 కొత్త కాలేజీలు వచ్చాయి… 33 జిల్లాల్లోనూ ఏర్పాటుచేస్తాం అన్నారు సీఎం కేసీఆర్. అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో 10 వేల ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు సీఎం. వైద్య విద్యకోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -