ధరణి @ మూడుచింతలపల్లి

210
cm kcr
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి పోర్టల్‌ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారైంది. మేడ్చల్ జిల్లాలోని మూడుచింతలపల్లి గ్రామం ఇందుకు వేదిక కానుంది. గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ని ప్రారంభించనున్నారు.

ధరణి పోర్టల్‌లో స్లాట్‌ బుక్‌ అయ్యాక నిర్దేశిత సమయానికి తాసిల్దార్‌ కార్యాలయానికి వెళ్తే పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తవుతుందని సీఎస్‌ సోమేశ్ కుమార్ తెలిపారు. ధరణి దేశంలోనే ట్రెండ్‌సెట్టర్‌గా నిలుస్తుందని …ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా, పారదర్శకంగా, వేగంగా సేవలు అందుతాయన్నారు.

స్లాట్‌ బుకింగ్‌లో ఇచ్చిన సమయానికి తాసిల్దార్‌ లేకపోయినా రిజిస్ట్రేషన్లు ఆగవని, వారి స్థానంలో నాయబ్‌ తాసిల్దార్‌ రిజిస్ట్రేషన్‌ చేస్తారని చెప్పారు.ధరణిలో ఎదురయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో సాంకేతిక బృందం ఉన్నదని సీఎస్‌ చెప్పారు. నెట్‌వర్క్‌ సమస్యలు రాకుండా ఉండేందుకు ఏడు సర్వర్లు పని చేస్తున్నాయని వెల్లడించారు. డాటా సేఫ్‌గా ఉంటుందని తెలిపారు.

పోర్టల్‌ నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడానికి ప్రతి మండలానికి రూ.10 లక్షల చొప్పున రూ.57 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు.

- Advertisement -