టిఆర్‌ఎస్ పూర్తిగా బిఆర్‌ఎస్ గా మారిన తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ నేషనల్ పాలిటిక్స్ లో దూకుడు పెంచారు. ప్రస్తుతం బిఆర్‌ఎస్ పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించే పనిలో బిజీ బిజీగా ఉన్నారు కేసిఆర్. ప్రస్తుతం జాతీయ పార్టీలుగా పేరున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఎదుర్కోవాలంటే.. ముందు అన్నీ రాష్ట్రాల్లోనూ బిఆర్‌ఎస్ పార్టీని బలపరచాల్సి ఉంటుంది. అప్పుడే దేశ ప్రజల దృష్టి బిఆర్‌ఎస్ పై పడుతుంది. దాంతో ముందు పార్టీ బలోపేతంపై కేసిఆర్ దృష్తి సారించారు. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాలలో బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపలంటే డిల్లీ కేంద్రంగా వ్యూహరచన చేయడం తప్పనిసరి.. అందులో భాగంగానే టిఆర్‌ఎస్ పార్టీ బిఆర్‌ఎస్ గా మారిన తరువాత మొదటి సారి కేసిఆర్ ఈనెల 12న డిల్లీ వెళ్లబోతున్నారు. ఇక 14న డిల్లీలో బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని స్థాపించనున్నారు.
ఈ క్రమంలోనే ఆయన పలువురి జాతీయ నేతలతో కూడా సమావేశం అవుతారని తెలుస్తోంది. కాగా ఇకపై కేసిఆర్ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేలా ఉండే అవకాశం ఉంది. ఇక వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వవాన్ని గద్దె దించాలని కేసిఆర్ పట్టుదలగా ఉన్నారు. ఈ క్రమంలో బీజేపీ వ్యతిరేక పార్టీల నుంచి కేసిఆర్ కు మొదటి నుంచి కూడా మద్దతు లభిస్తోంది. దాంతో బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేయడంలో కేసిఆర్ తన చతురత ప్రదర్శిస్తాడనేది కొందరి అభిప్రాయం. మరి రాబోయే రోజుల్లో బిఆర్‌ఎస్ తో కలిసినేదుకు పెద్ద ఎత్తున ప్రాంతీయ పార్టీల మద్దతు పెరిగే అవకాశం ఉంది. దాంతో ఇకపై తన వ్యూహాలను డిల్లీ కేంద్రంగానే అమలు చేయబోతున్నారు కేసిఆర్. మరి ఇప్పటివరకు పెట్టు విడువని, ఉద్యమ నేతగా, అనుకున్నది సాధించే పోలిటికల్ లీడర్ గా తెలంగాణ వరకే పరిమితం అయిన కేసిఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కూడా తన ముద్రా వేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి..