నేరెళ్ల మృతి కళారంగానికి తీరని లోటు…

363
KCR
- Advertisement -

మిమిక్రీ సామ్రాట్ నేరెళ్ల వేణుమాధవ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్‌లోని ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. నేరెళ్ల మృతి కళారంగానికి తీరని లోటని…ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం తెలిపారు.

మిమిక్రీ కళకు గౌరవం,ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహనీయుడని కొనియాడారు. మిమిక్రీ కళ పితామహుడిగా పేరొందారని ..మిమిక్రీ కళను పాఠ్యాంశంగా, అధ్యయనాంశంగా మలిచారని పేర్కొన్నారు. నేరెళ్ల అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Nerella Venu Madhav

1932, డిసెంబర్‌ 28న వరంగల్‌లో జన్మించిన వేణుమాధవ్‌ తన 16 ఏటనే మిమిక్రీ కెరీర్‌ను ప్రారంభించారు. భారత మాజీ రాష్ట్రపతుల దగ్గరి నుంచి అమెరికా అధ్యక్షుల వాయిస్‌ను అనుకరించి మన్ననలు పొందారు. 2001లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రధానం చేయగా ఏయూ, కేయూ, ఇగ్నో నుంచి గౌరవ డాక్టరేట్లను అందుకున్నారు.

నేరెళ్ల ప్రతిభను గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి పీవీ నరసింహరావు ఆయన్ని ఎమ్మెల్సీగా నామినేట్‌ చేశారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా హన్మకొండలోని పబ్లిక్‌ గార్డెన్‌లోని ఆడిటోరియానికి నేరెళ్ల వేణుమాధవ్‌ కళా ప్రాంగణంగా ప్రభుత్వం నామకరణం చేసింది.

- Advertisement -