బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు సీఎం కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రజలు, ముఖ్యం గా మహిళలు శుక్రవారం నుంచి అత్యంత సంతోషకర వాతావరణలో బతుకమ్మ పండుగ జరుపుకోవాలని సీఎం అభిలషించారు. ఈ సారి మంచి వర్షాలు కురవడంతో చెరువులన్నీ నిండాయని, గ్రామాల్లో జలకళ ఉట్టిపడడం పండుగ అనందాన్ని రెట్టింపు చేసిందని హర్షం వ్యక్తం చేశారు. చెరువులను అందమైన పూలతో నింపి ఆనందోత్సాహాల మధ్య తెలంగాణ అధికార పండుగను నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.
నీళ్లతో నిండుకుండలా ఉన్న చెరువులను అందమైన పూలతో నింపి ఆనందోత్సాహాల మధ్య తెలంగాణ అధికార పండుగను నిర్వహించుకో వాలన్నారు. దేవాలయాలు, చెరువుల వద్ద కావల్సిన ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 12 వరకు సెలవులు ప్రకటించినందున ప్రయివేటు విద్యాసంస్థలు కూడా విధిగా ఈ సెలవులు పాటించాలన్నారు.
మంచి వర్షాలు పడినందున వరుణదేవుడికి కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి, ప్రతి పల్లె పచ్చగా ఉండాలని, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరిసేలా దీవించాలని గౌరమ్మను ఈ సందర్భంగా వేడుకున్నారు. ఆడపడుచులను పుట్టింటికి తీసుకొచ్చి గౌరవించుకునే అరుదైన సంప్రదాయం, ఈ పండుగ అందించే గొప్ప సందర్భం అని సీఎం అభివర్ణించారు. తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రపంచానికి చూపించే బతుకమ్మ పండుగ సందర్భంగా దేవాలయాలు, చెరువుల వద్ద కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
బతుకమ్మ ఆడుకోవడానికి అనుగుణంగా చెరువుల వద్ద భూమిని చదును చేయాలని, లైటింగ్ ఏర్పాటు చేయాలని, నిమజ్జనాలకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు వచ్చే నెల 8న ఎల్బీ స్టేడియంలో ఒకేసారి పది వేల మంది మహిళలు మహాబతుకమ్మ ఆడేందుకు ఏర్పాట్లు చేసింది సర్కార్.
https://youtu.be/E0t_r9as49c