దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసు..ఉరి శిక్ష సరైనదే

23
- Advertisement -

దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల పై తీర్పు వెల్లడించింది తెలంగాణ హైకోర్టు. పేలుళ్లకు పాల్పడ్డ ఐదుగురికి ఉరి శిక్ష సరైనదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు విషయంలో NIA ప్రత్యేక కోర్టు తీర్పును సమర్ధించింది హైకోర్టు.

2013 ఫిబ్రవరి 2 దిల్​సుఖ్​నగర్​లో ఉగ్రదాడి జరిగింది. వరుసగా రెండు పేలుళ్లు సంభవించాయి. ఈ వరుస పేలుళ్ల ఘటనలో మొత్తం 18 మంది మృతి చెందగా, మరో 131 మంది గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన 12 ఏళ్ల తర్వాత ఈ కేసులో ఇవాళ హైకోర్టు కీలక తీర్పును వెలువరింంచింది.

ఇండియన్​ ముజాహిద్దీన్​ ఉగ్ర సంస్థ టిఫిన్​ బాక్సులో బాంబు పెట్టి ఈ పేలుళ్లకు పాల్పడింది. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులకు ఎన్​ఐఏ ప్రత్యేక కోర్టు 2016లో ఉరి శిక్ష విధించగా, వారు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నిందితులకు ఉరి శిక్ష సరైందేనని తెలిపింది.

పేలుళ్లకు కీలక సూత్రధారి మహ్మద్ రియాజ్ అలియా రియాజ్ బక్తల్​గా గుర్తించారు. ప్రధాన నిందితుడు రియాజ్ బక్తల్ మినహా మిగిలిన ఐదుగురు నిందితులపై ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో 2015లో ట్రయల్ కొనసాగింది. విచాణలో భాగంగా 157 మంది సాక్షులను విచారించారు. వారి నుంచి సేకరించిన ఆధారాలు ఎన్‌ఐఏ కోర్టుకు సమర్పించగా 2016 డిసెంబర్ 19న ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు వారికి జైలు శిక్ష, జరిమానాలతో పాటు ఉరిశిక్ష విధించింది.

Also Read:పవన్‌ కొడుకుకి గాయాలు..

- Advertisement -