దేశ వ్యాప్తంగా అప్పుడే వినాయక చవితి సందడి మొదలైంది. లంబోదరుడి మండపాల ఏర్పాట్లలో మునిగిపోయారు. ఇక ప్రతి ఏడాది కంటే ఎక్కువగా ఈ ఏడాది సైతం మట్టి గణపతులకు మరింత ఆదరణ లభిస్తోంది.
మట్టి, గడ్డి, జనప నార, వెదురు పుల్లల వంటి సహజంగా లభించే పదార్థాలను ఉపయోగించి విద్యార్థులు వినాయక విగ్రహాల వల్ల ఎలాంటి నష్టం ఉండదు.పర్యావరణానికి కూడా హాని కలగకపోవడంతో ఏడాదికేడాది మట్టి గణపతి విగ్రహాలకు ఆదరణ పెరుగుతోంది. ప్రభుత్వాలు, మీడియా, స్వచ్ఛందసంస్థలు గత కొన్నేళ్లుగా మట్టి విగ్రహాలను వాడే సంస్కృతి బాగానే పెరిగింది.
పర్యావరణ హిత విగ్రహాలను ప్రోత్సహించేందుకు కాలుష్య నియంత్రణ మండలి(PCB) గ్రేటర్ హైదరాబాద్‌లోని 14 ప్రాంతాల్లో మట్టి వినాయక విగ్రహాలను అందుబాటులో ఉంచనున్నది. ఈ ప్రాంతాల్లో స్టాళ్లను ఏర్పాటు చేసి విగ్రహాలను విక్రయించనున్నది. గురువారం (ఆగస్టు-17) మాదాపూర్‌లోని శిల్పారామం వద్ద తొలిస్టాల్‌ను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 14 స్టాళ్లలో ఇప్పటి వరకు 11 ప్రాంతాలను గుర్తించగా, మిగిలిన మూడు స్టాళ్ల ఏర్పాటుపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ స్టాళ్లను నగరంలోని కోఠి మహిళా కాలేజీ ఎదుట, వైఎంసీఏ గణేశ్ టెంపుల్-మారేడ్‌పల్లి, మెహదీపట్నం రైతుబజార్, అమీర్‌పేట సత్యంథియేటర్, జీడిమెట్ల సుభాష్‌నగర్ బస్టాప్, మల్కాజిగిరి గౌతంనగర్, ఉప్పల్ రింగ్‌రోడ్, మల్లాపూర్ మాణిక్‌చంద్ చౌరస్తా, సనత్‌నగర్ పీసీబీ కార్యాలయం, ఎర్రగడ్డ రైతుబజార్, మాదాపూర్‌లోని శిల్పారామం వద్ద ఏర్పాటు చేయనున్నారు.
గణేశుడి విగ్రహాలను ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేస్తే..ఆ విగ్రహాల్లో వాడే రసాయనాలు ఇతర సామాగ్రి కాలుష్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అంతేకాకుండా పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. భారీ విగ్రహాల్లో వాడే కెమికల్స్ వల్ల ఎన్నో అనర్థాలుండటంతో ఎకో ఫ్రెండ్లీ గణేశుని విగ్రహాల వైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారు.పండుగలనేవి మత విశ్వాసాలను చాటుకుంటూనే..పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యలు కావాలని గ్రేట్ తెలంగాణ.కామ్ కొరుకుంటోంది.