ప్రభాస్‌ పేమెంట్‌ 30 కోట్లా..?

187
Prabhas's remuneration for his next movie Saaho
- Advertisement -

బాహుబలి ఘన విజయం తరువాత ప్రభాస్ తదుపరి చిత్రంగా ‘సాహో’ రూపొందుతుంది. ఈ సినిమాను డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని యూవి క్రియేషన్స్ ప్రొడక్షన్‌ వారు 200 కోట్లు బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కు ప్రతినాయకుడు గా బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేష్ నటిస్తున్నాడు.

Prabhas's remuneration for his next movie Saaho

తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ఈ సినిమాకు గాను రూ. 30 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నాడు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో తయారవుతున్న ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. ఇక ప్రభాస్ రూ. 30 కోట్లు తీసుకుంటున్న విషయం నిజమే అయితే, అంత పారితోషికం తీసుకున్న తొలి తెలుగు హీరోగా కూడా ప్రభాస్ నిలుస్తాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా శ్రద్దాకపూర్‌ నటించనుంది.

ప్రస్తుతం రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సాహో ..తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఏకకాలంలో రూపొందనున్న ఈ చిత్రానికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ పనిచేయనుండగా బాలీవుడ్ సంగీత దర్శకుల త్రయం శంకర్, ఇహసాన్, లోయ్ లు సంగీతాన్ని అందించనున్నారు. ఇక ‘ఘాజి’ ఫేమ్ మది సినిమాటోగ్రఫీ అందించనున్నారు.

- Advertisement -