వినాయకచవితిపై రాజకీయాలోద్దు:తలసాని

195
talasani
- Advertisement -

వినాయక చవితి పండగలపై రాజకీయాలు చేయడం తగదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ మసాబ్ ట్యాంక్‌ లోని తన కార్యాలయంలో స్వాతి ప్రమోటర్స్ డెవలపర్స్ ఆధ్వర్యంలో 10 వేల మట్టి వినాయకుడి ప్రతిమలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని..ఆరేళ్లలో అన్ని పండుగలను ఎంతో ఘనంగా చేసుకొన్నాం…అన్ని వర్గాల సంప్రదాయాలను గౌరవించే వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు.వినాయక ఆలయాల్లో బ్రహ్మాండంగా పూజలు జరుగుతాయి…
రాజకీయ కోణంలో ఆలోచించే వాళ్ళు ప్రజల బాగోగుల గురించి ఆలోచించాలన్నారు తలసాని.

ఈ సంవత్సరం వినాయక ఉత్సవాల సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్, పలు సంస్థల ఆధ్వర్యంలో లక్ష మట్టి వినాయకులు పంపిణీ చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారని చెప్పారు.ఈ ఏడాది ప్రజలంతా మట్టి గణపతితో ఇళ్లలోనే పూజలు చేసుకోవాలన్నారు తన నియోజకవర్గంలో 10 వేలు పంపిణీ చేస్తున్నాం…మట్టి గణపతులు పంపిణీ చేస్తున్న సంస్థలకు అభినందనలు తెలిపారు తలసాని.

- Advertisement -