చంద్రబాబు పవన్ మధ్య క్లాష్..తప్పదా?

40
- Advertisement -

ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్ది ఎలాంటి మలుపులు తిరుగుతాయో ఊహించడం కష్టంగా ఉంది. ముఖ్యంగా ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతున్న టీడీపీ జనసేన మద్య చోటు చేసుకుంటున్న పరిణామాలు విశ్లేషకులకు సైతం అంతుచిక్కడం లేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గద్దె దించడమే లక్ష్యంగా ఉన్న ఈ రెండు పార్టీల మద్య సీట్ల పంపకాల విషయంలో క్లాష్ తప్పెలా కనిపించడం లేదు. ఏపీ ఎన్నికల్లో ఏదైనా పార్టీ గెలుపోటములను డిసైడ్ చేయడంలో ఉత్తరాంధ్ర కీలక పాత్ర పోషిస్తుంది. .

ఇక్కడ మెజారిటీ సీట్లు కైవసం చేసుకున్నా పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ప్రస్తుతం ఉత్తరాంధ్ర విషయంలో టీడీపీ జనసేన మద్య చిచ్చు రగిలేలా కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలోని టీడీపీ బలమైన స్థానాలపై జనసేన గురి పెట్టిందట. ముఖ్యంగా శ్రీకాకులం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి వంటి జిల్లాల్లో మెజారిటీ స్థానాలను జనసేన ఆశీస్తోందట. దీంతో టీడీపీ కంచుకోటగా ఉన్న నియోజిక వర్గాలను జనసేనకు ఇచ్చేస్తే టీడీపీకి బలం తగ్గే అవకాశం ఉందని చంద్రబాబు ఆలోచనలో పడినట్లు ఏపీ పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు నడుస్తున్నాయి.

Also read:షర్మిలకు కండిషన్స్ అప్లై.. వాట్ నెక్స్ట్?

ఇకపోతే జనసేన అండ లేకుండా టీడీపీ సొంతంగా గెలిచే అవకాశం ఉందా అంటే సొంత నేతలే కాన్ఫిడెంట్ గా చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో జనసేన అడిగినన్ని సీట్లు ఇవ్వడం తప్ప టీడీపీ ముందు వేరే దారి లేనట్లే కనిపిస్తోంది. ఇదే కాకుండా టీడీపీ జనసేన పార్టీల పొత్తు కన్ఫర్మ్ అయితే సి‌ఎం అభ్యర్థి విషయంలో కూడా రెండు పార్టీల మద్య క్లాష్ తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం చంద్రబాబు మరియు పవన్ ఇద్దరు సి‌ఎం పదవే టార్గెట్ గా ముందుకు సాగుతున్నారు. సి‌ఎం చైర్ పై ఎవరు వెనక్కి తగ్గేల కనిపించడం లేదు. దీంతో ఇరు ఎవరు పట్టుదలతో ఉంటారు ? ఎవరు రాజీకి వస్తారు అనేది విశ్లేషకులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. మరి టీడీపీ జనసేన మద్య ఈ అంశాలపై తుది నిర్ణయం ఎప్పుడు వెలువడుతుందో చూడాలి.

Also Read:అధ్యక్ష పదవికి నేను అర్హుడినే:రఘునందన్‌

- Advertisement -