కాంగ్రెస్‌ను నమ్మితే కల్లోలమే..?

23
- Advertisement -

తెలంగాణలో అధికారం మాదేనని, కర్నాటక ఫలితలే రిపీట్ అవుతాయని టి కాంగ్రెస్ ఈ మద్య తెగ హడావిడి చేస్తోంది. అంతకుముందు తెలంగాణలో ఉనికిని కోల్పోయే ప్రమాదంలో ఉన్న పార్టీ.. ఇప్పుడేమో ప్రాణం లేచివచ్చినట్లుగా మాదే అధికారం అని పగటి కలలు కంటోంది. హస్తం నేతలు కనే కలలు నెరవేరే పరిస్థితి లేదనేది అందరికీ తెలిసిన విషయమే. కర్నాటకలో గెలిచామని, దేశమంత కాంగ్రెస్ కు పునః వైభవం వస్తోందని హస్తం నేతలు సంబరపడుతున్నారు. నిజానికి .కర్నాటకలో కాంగ్రెస్ గెలుపుకు కారణం ప్రజల్లో బీజేపీపై ఉన్న వ్యతిరేకతే కారణం తప్పా.. కాంగ్రెసే సమర్థత ఏమాత్రం కాదనేది చాలమంది చెబుతున్నా మాట..

బీజేపీకి ప్రత్యామ్నాయం లేక ప్రజలు అక్కడ కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టారు. కానీ తెలంగాణలో అలా కాదు. తెలంగాణలో రాష్ట్రం ఏర్పడినది మొదలు కొని తన పాలన దక్షతతో సుభిక్షంగా ఉంచుతున్నారు సి‌ఎం కే‌సి‌ఆర్. అటు అభివృద్ది విషయంలోనూ ఇటు సంక్షేమం విషయంలోనూ తన సమర్థతతో తెలంగాణను అగ్రపథంలో నడుపుతున్నారు. అలాంటి కే‌సి‌ఆర్ పాలనను కాదని ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకోవడానికి ఏ మాత్రం సిద్దంగా లేరనేది వాస్తవం. ఈ నేపథ్యంలో బి‌ఆర్‌ఎస్ ను దెబ్బ తీసేందుకు లేని పోనీ ఆరోపణలను తెరపైకి తెస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్షల కోట్ల అవినీతి జరిగిందని, ధరణి అంతా అవినీతి మాయం అని ఇలా రకరకాలు అవాస్తవ ఆరోపణలను తెరపైకి తెస్తూ బి‌ఆర్‌ఎస్ పై బురదజల్లే ప్రయత్నం చేస్తోంది.

Also Read:నేను డౌటే.. బండి హింట్ ఇచ్చాడా?

ఇక్కడ హస్తం నేతలు గ్రహించని విషయం ఏమిటంటే లక్ష కోట్లు దాటని కాళేశ్వరంలో లక్షల కోట్లు ఎలా అవినీతి జరిగింది.. ? అనే కనీస అవగాహన లేదనిది స్పష్టంగా అర్థమౌతోంది. ఇక ధరణి ని రద్దు చేస్తామని కాంగ్రెస్ పదే పదే చెబుతోంది. రైతులకు అత్యంత ఉపయోగ కరంగా ఉన్న ధరణి రద్దు చేస్తే కాంగ్రెస్ కు ఒరిగెదేంటి ?.. ఇంకోవిషయం ఏమిటంటే బి‌ఆర్‌ఎస్ ను నేరుగా డీ కొట్టే దమ్ములేక బీజేపీతో దోస్తీని అంటగట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో బి‌ఆర్‌ఎస్ కు బీజేపీ మరియు కాంగ్రెస్ రెండు ప్రత్యర్థులే అనే సంగతి మరచిపోతోంది హస్తం పార్టీ. ఇలాంటి కల్లబొల్లి కబుర్లు చెప్పే కాంగ్రెస్ ను నమ్మితే రాష్టంలో కల్లోలం ఏర్పడడం ఖాయమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే‌టి‌ఆర్ ట్విట్టర్ వేధికగా కాంగ్రెస్ పై విమర్శలు ఎక్కుబెట్టారు. ప్రస్తుతం కే‌టి‌ఆర్ చేసిన వ్యాఖ్యలు పోలిటికల్ సర్కిల్స్ లో తెర వైరల్ అవుతున్నాయి.

Also Read:సినీ లోకంలో రెండు విషాదాలు

- Advertisement -