అధికార పార్టీలతో పోలీసుల కుమ్మక్కు..మూల్యం చెల్లించక తప్పదు

139
CJI NV Ramana
- Advertisement -

అధికార పార్టీలతో కుమ్మక్కైన పోలీసులు మూల్యం చెల్లించక తప్పదని తెలిపారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. అధికారంలో ఉన్న నేతలు, పోలీసులు కుమ్మక్కవడమనే కొత్త సంస్కృతి దేశంలో మొదలయ్యిందని …ప్రభుత్వం మారినప్పుడు తప్పనిసరిగా వారు తిరిగి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు.

అధికారంలో ఉన్న పార్టీలతో సన్నిహితంగా మెలిగి, అక్రమాస్తులు కూడబెట్టుకున్న పోలీసు అధికారులను ఎందుకు రక్షించాలని, వారు జైలుకు వెళ్లాల్సిందేనని పేర్కొన్నారు రమణ.

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి గుర్జీందర్‌ పాల్‌ సింగ్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఆయనపై రాజద్రోహం అభియోగాన్ని కూడా మోపింది. ఈ కేసుల్లో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోసం చత్తీస్‌గఢ్ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు నిరాశే ఎదురైంది. దీంతో సుప్రీంను ఆశ్రయించగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -