థియేటర్లలోనే భీమ్లా నాయక్!

30
pawan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. మలయాళ బ్లాక్ బస్టర్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతుండగా తాజాగా సినిమాకు సంబంధించి అప్‌డేట్ వచ్చేసింది.

ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు సుముఖంగా ఉన్నారని.. ఇప్పటికే బేరసారాలు జరుగుతున్నాయని రూమర్స్ రాగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 2022 జనవరి 12న సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

చిత్రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా ప్ర‌ధాన పాత్రలు పోషిస్తుండ‌గా, పవన్ భార్యగా నిత్యా మీనన్ నటిస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.