స్వగ్రామంలో పర్యటించిన సీజేఐ ఎన్వీ రమణ..

34

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పొన్నవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన తర్వాత మొదటిసారి ఆయన స్వగ్రామం రావడంతో గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. దారిపొడవునా ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు.

గ్రామానికి చేరుకున్నజస్టిస్ ఎన్వీ రమణను ఎడ్లబండిపై ఎక్కించి గ్రామంలోని శివాలయం వద్దకు తీసుకెళ్ళారు. అక్కడ ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కాసేపు ముచ్చటించారు. మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ పర్యటన కొనసాగనుంది.