ఈ నెల 25 నుంచి దేశీయ విమానాలు మూసివేత

404
airplane
- Advertisement -

కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 25 నుంచి అన్ని దేశీయ కార్యకలాపాలను నిలిపివేయనున్నట్లు విమానయాన శాఖ ప్రకటించింది.. సరకు రవాణా విమానాలు తప్ప అన్ని సర్వీసులు రద్దు చేయనున్నారు.

విమానయాన సంస్థలు తమ విమానాలు మంగళవారం అర్తరాత్రిలోగా గమ్యస్థానాలకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచనలు చేసింది. కాగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను ప్రకటించారు. ఆర్టీసీ, రైల్వే వ్యవస్ధను మార్చి 31 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

- Advertisement -