సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ సినీ రథసారథులు `సినీ మహోత్సవం` సెప్టెంబర్ 8న గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సినీ, రాజకీయ ప్రముఖులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు విచ్చేశారు. “సినీ మహోత్సవం కార్యక్రమాన్ని నటీనటులు, దర్శకులు, 24 శాఖలు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఫిలిమ్ చాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారి సహకారంతో విజయవంతంగా పూర్తి చేశాం.
ఇంత పెద్ద కార్యక్రమంలో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ ఆర్టిస్టులందరినీ తీసుకొచ్చి, మాతో పాటు మూడు నెలలు పాటు శ్రమించారు. ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి ప్రధాన కారకుడు హరినాథ్‌గారే. ఆయన సహకారాన్ని మరచిపోలేం. ఆయనే లేకపోతే ఈ ప్రోగ్రామే లేదు. ఆర్టిస్టులందరినీ ఆయన తీసుకొచ్చారు.
అలాగే గీతాఆర్ట్స్ బాబూగారు, మహేంద్రబాబుగారు, లేడీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ దీప్తిగారు సహా ఇతర ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ అందించిన సపోర్ట్‌కి థ్యాంక్స్. అలాగే మా కార్యవర్గంలోని సభ్యులు కూడా ఎంతగానో సహకరించారు. వాలెంటరీగా పనిచేసిన ప్రతి ఒక్కరికీ యూనియన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఈవెంట్ చేసిన శ్రేయాస్ మీడియావారికి, టెలికాస్ట్ హక్కులు దక్కించుకున్న జెమినీ టీవీవారికి మా ప్రత్యేక ధన్యవాదాలు“ అని ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ తెలియజేసింది.