రివ్యూ : సినీ మహల్

294
Cine Mahal movie review
- Advertisement -

కళానిలయ క్రియేషన్స్ సమర్పణలో లక్ష్మణ్ దర్శకత్వంలో తెర‌కెక్కిన‌ చిత్రం `సినీ మహల్`. `రోజుకు 4 ఆటలు` అనేది ఉపశీర్షిక.  బి.రమేష్ నిర్మాతగా, పార్థు, బాలాజీ, మురళీధర్ , మహేంద్ర సహనిర్మాతలుగా ఈ చిత్రం తెరెక్కెక్కింది.  విభిన్నమైన కాన్సెప్ట్ తో హర్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినీమహల్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం..

Cine Mahal movie review

కథ :

ఒక పెద్దసైజు పల్లెటూర్లో తన తాత కట్టించిన టూరింగ్ టాకీస్ ను నడుపుకునే యువకుడు కృష్ణ. తన నాన్న చేసిన అప్పును తీర్చి టాకీస్ కాపాడుకోవాలని కష్టపడుతుంటాడు.మంచి సినిమాలు రాకపోవడంతో థియేటర్ కు జనాలు రావడం తగ్గుతుంది. ఆదాయం కూడా సరిగ్గా రాదు. దీంతో అయోమయంలో పడిపోతాడు. ఈ క్రమంలో ఓ సినిమా తన జీవితాన్ని మలుపు తిప్పుతుంది. తన థియేటర్లో ప్రదర్శిస్తున్న ఓ సినిమా కారణంగా కొంతమంది చనిపోతుంటారు. అసలు ఎందుకు చనిపోతున్నారా అని హీరో ఎంక్వైరీ మొదలు పెడతాడు. ఈ ప్రయత్నంలో పలు ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. ఇంతకూ ఆ సినిమా ఏంటి. సినిమా చూసిన అందరు కాకుండా కొంతమంది మాత్రమే ఎందుకు చనిపోతున్నారు. అసలు రహస్యమేంటనే విషయం తెలియాలంటే  తెరమీద చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ తరహా కథను తెలుగు సినిమాల్లో గతంలో చూడలేదు. సినిమాలు చూస్తే మనుషులు ఎందుకు చనిపోతున్నారనే కాన్సెప్ట్ డిఫరెంట్‌గా అనిపిస్తుంది.  థియేటర్లో సినిమా చూసిన వాళ్ళు కొందరు చనిపోవడం, ఆ సినిమా వెనక్కున్న థ్రిల్ చేసే అసలు వాస్తవం వంటి అంశాలు బాగున్నాయి. అలీరాజా,సోహెల్,తేజస్విని నటన సినిమాకు బాగా ఉపయోగపడింది. అలాగే హీరో ఫ్రెండ్ పాత్రలో కమెడియన్ సత్య చేసిన కామెడీ  బాగానే పేలింది.  సలోని సాంగ్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

మైనస్ పాయింట్స్ :

సినిమాలోని మైనస్ పాయింట్ అంటే అది కథనమే. ఫస్టాఫ్ ఆరంభం కాస్త బాగానే ఉన్నా పోను పోను సినిమా రొటీన్ గా తయారైంది. ఇంటర్వెల్ సమయంలో సినిమా వెనకున్న నిజం బయటపడే సన్నివేశం తప్ప మిగతా అంతా బోరింగానే సాగింది. ఇక ఈ కథలో ముఖ్యమైన సినిమా తీసే ఎపిసోడ్ అస్సలు ఆకట్టుకోలేదు.  క్లైమాక్స్ అంతగా ఆకట్టుకోదు.

సాంకేతిక విభాగం :

శేఖర్ చంద్ర అందించిన సంగీతం బాగుంది. పాటలతో పాటు రీరికార్డింగ్ సినిమాకు బాగా హెల్ప్‌ అయింది. దొరై కె.సి.వెంకట్ సినిమాటోగ్రఫీ అక్కడక్కడా మాత్రమే పర్లేదనిపించింది. ప్రవీణ్ పూడి తన ఎడిటింగ్ ద్వారా ఇంకాస్త సెకండాఫ్ కథనాన్ని కట్ చేసి ఉండాల్సింది. దర్శకుడు లక్ష్మణ్ వర్మ కథకు కావాల్సిన మూలాన్ని బాగానే తయారు చేసుకుని దాని ద్వారా సినిమా చేద్దాం అనుకోవడం బాగున్నా కూడా దాని చుట్టూ కావాల్సిన బలమైన కథ, కథనాలను పూర్తి స్థాయిలో అల్లుకోలేకపోయాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Cine Mahal movie review

తీర్పు:

ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు, థ్రిల్లింగ్‌ కాన్పెప్ట్ కావడంతో… ఎంగేజింగ్ గా ఉంది. బాగుందనిపించే కీ పాయింట్, అక్కడక్కడా నవ్వించిన సత్య కామెడీ, ఫస్టాఫ్ ఆరంభం, ఇంటర్వెల్ లో అసలు వాస్తవం బయటపడటం ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కాగా ఏమాత్రం ఆకట్టుకొని ఫస్టాఫ్, సెకండాఫ్ కథనాలు  నాటకీయంగా అనిపించే క్లైమాక్స్ ఎపిసోడ్ మైనస్ పాయింట్స్.  ఓవరాల్ గా ఓవరాల్ గా డిఫరెంట్ కాన్పెప్ట్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు.

విడుదల తేదీ :  31/03/ 2017
రేటింగ్ : 2.5/5
నటీనటులు :సిద్ధాంశ్ , రాహుల్, తేజస్విని
సంగీతం : శేఖ‌ర్ చంద్ర‌
నిర్మాత : బి.రమేష్
దర్శకత్వం : లక్ష్మణ్ వర్మ

- Advertisement -