రజినీకి 5..అక్షయ్‌కి 12..!

219
2.0 Shankar on Rajinikanth's 5 roles, Akshay Kumar's 12 avatars
- Advertisement -

రోబో చిత్రానికి సీక్వెల్‌గా రజనీకాంత్‌, శంకర్‌ల కాంబినేషన్‌లో 2.0 చిత్రం రూపొందుతోందన్నవిషయం తెలిసిందే.ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది.ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తుండగా, ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో.. లెక్క ఎక్కువైనా పర్లేదు కానీ.. తక్కువ కాకుండా చూస్తున్నారు.

2.0 Shankar on Rajinikanth's 5 roles, Akshay Kumar's 12 avatars

ఈ సినిమాపై రకరకాల పుకార్లు ఇప్పటికే చాలా షికారు చేసేశాయి. ఇప్పుడు తాజాగా కూడా ఓ హాట్ గాసిప్ చక్కర్లు కొట్టేస్తోంది. 2.0 మూవీలో రజినీకాంత్ ఐదు రకాల గెటప్స్ తో కనిపించనున్నారన్నది దీని సారాంశం. చిట్టి రోబో సైంటిస్ట్ వశీకరణ్ లతో పాటు విలన్ రోబో మరో రెండు గెటప్స్ ఉంటాయని చెబుతున్నారు. రజినీ 5 గెటప్స్ లో కనిపిస్తే విలన్ గా నటిస్తున్న అక్షయ్ కుమార్ ఏకంగా 12 గెటప్స్ లో కనపిస్తాడన్నది టాక్. అయితే ఈ రూమర్స్ పై ఇప్పుడు దర్శకుడు శంకర్ స్పందించాడు.

తమ చిత్రంపై వస్తున్న వార్తలన్నీ రూమర్స్ మాత్రమేనని ఇలాంటివేవీ ఉండబోవని తేల్చేశాడు శంకర్. 2.0 చిత్రంపై తామే అన్ని అప్ డేట్స్ ఇస్తామని.. ఇలాంటివేమీ నమ్మాల్సిన పని లేదని శంకర్. ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఈ ఏడాది దీపావళి సందర్భంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతుండగా మరికొన్ని రోజుల్లో ప్యాచ్ వర్క్ కూడా పూర్తి చేశారు. షూటింగ్‌ కూడా పూర్తి చేయబోతున్నారు.

- Advertisement -