కొత్తగా చేరిన ఓట్లతోనే ఓటమి: రాహుల్

14
- Advertisement -

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయన్నారు ఎంపీ రాహుల్ గాంధీ. మీడియాతో మాట్లాడిన రాహుల్.. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని మార్చారు అన్నారు. మహారాష్ట్రలో ఐదేళ్లలో 32 లక్షల మంది కొత్త ఓటర్లు చేరారు అన్నారు.

మహారాష్ట్రలో లోక్‌సభ – అసెంబ్లీ ఎన్నికల మధ్య సమయంలో 39 లక్షల కొత్త ఓటర్లు చేరారు.. ఈ 39 లక్షల మంది కొత్త ఓటర్లు ఎవరు? చెప్పాలన్నారు. ఇది హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్యతో సమానం అన్నారు. కొత్తగా చేరిన ఓట్లే ఆ కూటమి పార్టీలకు విజయాన్ని అందించాయి అన్నారు.

మాకు ఓటర్ల జాబితా, వారి ఫొటోలు, చిరునామాలు అందించాలని ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేస్తున్నాం అన్నారు. పార్లమెంట్‌లో ఈ అంశాన్ని నేను లేవనెత్తినప్పటికీ ఈసీ నుంచి సమాధానం రాలేదు అని… తాను ఆరోపణలు చేయడం లేదు.. గణాంకాలు, డేటా ముందు పెట్టి సందేహాలను నివృత్తి చేయాలని కోరుతున్నా అన్నారు.

Also Read:వేసవిలో అద్భుతమైన ఫుడ్, డ్రింక్స్ ఇవే

- Advertisement -