- Advertisement -
విధ్వంసకర ఆటగాడు వెస్టిండిస్ కీలక ప్లేయర్ క్రిస్ గేల్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. టీమిండియాతో జరిగే హోం టెస్ట్ సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు గేల్ ప్రకటించాడు.
ఒక మంచి ఫేర్ వెల్ సిరీస్ లభించాలనే ఉధ్దేశంతోనే టీం ఇండియా సిరీస్ తర్వాత రిటైర్ కావాలని గేల్ భావిస్తున్నట్లు సమాచారం.1999లో టీమిండియాతో జరిగిన వన్డే మ్యాచ్ తో అంతర్జాతీయ జట్టులోకి ఆరంగేట్రం చేశాడు.
ఇప్పటి వరకు 103 టెస్టులు, 295 వన్డేలు, 58 టీ-20 మ్యాచ్ లు ఆడాడు. టెస్టుల్లో 7,214, వన్డేల్లో 10,345, టెస్టుల్లో 1,627 పరుగులు చేశాడు. తన విధ్వంసకరమైన బ్యాటింగ్‌తో గేల్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.
- Advertisement -