ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
చౌటుప్పల్ మున్సిపల్ ఒకటో వార్డు పరిధిలోని లింగారెడ్డిగూడెం, తాళ్ల సింగారం లకు చెందిన 18 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో 1, 13 వార్డుల ఇంచార్జ్, పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకొని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుకోవచ్చని అన్నారు. తన ఆర్థిక అభ్యున్నతి కోసం మునుగోడు ప్రజలను మోసం చేసిన బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమని అన్నారు. దశాబ్దాలుగా నెలకొని ఉన్న ఫ్లోరోసిస్ సమస్యకు చరమగీతంపాడి ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా రక్షిత మంచినీళ్లు అందించిన మహోన్నత నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. ప్రతి కాలనీలో, వార్డుల్లో, గ్రామాల్లో టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.
టిఆర్ఎస్ పార్టీలో చెందిన కాంగ్రెస్ నాయకుల వివరాలు..
దోనకొండ శ్రీను, వెంకటేష్, లింగస్వామి, ప్రమోద్, పెంటయ్య, నరేష్, స్వామి, మల్లేష్, లింగస్వామి, సారిపల్లి స్వామి, శ్యామ్ యాదవ్, నర్సింలు, సూర్య, సురేందర్, మల్లేష్, శ్రీను, ముత్తయ్య.