‘చిరు – బాలయ్య’ లతో మల్టీ స్టారర్ !

146
- Advertisement -

బాలకృష్ణ టాక్ షో “అన్ స్టాపబుల్” కి సినిమా విజ్ఞానాన్ని అద్దబోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఔత్సాహిక ఫిలింమేకర్స్ కి అవసరమయ్యే బోలెడంత కంటెంట్ ను తర్వాత వచ్చే ఎపిసోడ్ లో పరిచయం చేయబోతున్నారు. ఇందుకోసం ఈ ఎపిసోడ్ కి డి.సురేష్ బాబు.. అగ్ర నిర్మాత `ఆహా` అధినేత అల్లు అరవింద్… లెజెండరీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు గెస్టులుగా తీసుకొచ్చారు. ఈ సీజన్‌లో ఇది 5వ ఎపిసోడ్. డిసెంబర్ 2న ప్రసారం కానుంది.

తాజాగా ఈ ఎపిసోడ్ 5 ప్రోమో రిలీజ్ అయి చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఈ ప్రోమోలో అల్లు అరవింద్, సురేష్ బాబులతో పాటు రాఘవేంద్ర రావు లను కూడా బాలయ్య తనదైన శైలిలో ఆహ్వానించాడు. హత్తుకున్నాడు. ఐతే, ఈ ప్రోమోలో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. బాలకృష్ణ, చిరంజీవితో మల్టీస్టారర్ చేయాలనుకుంటున్నట్లు కామెంట్ చేశాడు. వెంటనే.. అది పాన్ వరల్డ్ సినిమా అవుతుందని బాలయ్య స్పందించాడు.

మొత్తానికి ఈ రెండు మాటలతో ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతోంది. అలాగే ఈ ఎపిసోడ్ లో నేటితరం ఫిలింమేకర్స్ కి అవసరమైన విలువైన సమాచారాన్ని చర్చించబోతున్నారు. మొత్తానికి ఎంటర్ టైన్మెంట్ టార్గెట్ గా స్టార్ట్ అయిన బాలయ్య ‘అన్ స్టాపబుల్’ టాక్ షో రాజకీయ రంగుతో పాటు కొత్త తరానికి విద్యను నేర్పే ప్లాట్ ఫామ్ గానూ టర్న్ తీసుకుంది.

ఇవి కూడా చదవండి…

ఆ హీరోయిన్ కార్య‌క్ర‌మాలు గొప్పవి

సొమ్ము చేసుకోవ‌డంలో ఆమె క్రేజే వేరు

రికార్డును తిరగరాసే అవకాశం…దృశ్యం-2!

- Advertisement -