మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. సురెందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈసినిమాను రామ్ చరణ్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈచిత్ర టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. గాంధీ జయంతి అక్టోబర్ 2న ఈచిత్రాన్ని విడుదల చేయనున్నారు.
త్వరలోనే ఆడియో వేడుకలను నిర్వహించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం కేవలం 20రోజుల్లోనే చిరంజీవి ఈమూవీ డబ్బింగ్ పూర్తి చేశాడట. ఒక చారిత్రాత్మకమైన మూవీలో డబ్బింగ్ ఇంత తొందరగా పూర్తి చేయడం అంటే ఆశ్చర్యకరమైన విషయంగా చెప్పుకోవాలి.
ఈమూవీలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కీలకపాత్రలో కనిపించగా, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి పలువురు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈమూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ ను కర్నూలు లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. ఈనెల 15న ఈఆడియో ఫంక్షన్ ను జరపాలని చూస్తున్నారట.