మెగాస్టార్ కి ఆ పేరు ఎలా వ‌చ్చిందంటే ?

29
- Advertisement -

తెలుగు ప్రజల అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నేడు. చిరంజీవి గురించి ఎప్పుడు ప్ర‌స్తావ‌నా వ‌చ్చిన మెగాస్టార్ అనే బిరుదుతో పిలుస్తుంటారు. ఇంతకీ, ఆయనకు మెగాస్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందో తెలుసా ?, ప్ర‌ముఖ నిర్మాత‌ KS రామారావు ఆ బిరుదుని ఇచ్చారు. చిరంజీవి, KS రామారావు కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మ‌ర‌ణమృదంగం సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్న చిరుకి సుప్రీం హీరో బిరుదు క‌రెక్ట్ కాదని మెగాస్టార్ అనే బిరుదు ఫిక్స్ చేశార‌ట‌ ఆయన. అప్పటి నుంచి మెగాస్టార్ బిరుదు ఓ బ్రాండ్‌ లా మారిపోయింది.

ఆ బ్రాండ్ విలువ కొన్ని వందల కోట్లు వరకూ చేరింది. ఈ క్రమంలో చిరు సంపాదించిన ఆస్తుల విలువ పై కూడా అభిమానుల మధ్య చర్చ మొదలైంది. అసలు మెగాస్టార్ కి ఎన్ని వందల కోట్లు ఉన్నాయి ? అంటూ మెగా ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు. ఇంతకీ మెగాస్టార్ ఆస్తుల విలువ ఎంతంటే రూ.1650 కోట్ల కంటే ఎక్కువ అని సమాచారం. చిరంజీవి వద్ద అత్యంత ఖరీదైన ఒక ప్రైవేట్ జెట్‌ కూడా ఉంది. హైదరాబాద్ నగరంలో అత్యంత విలాసవంతమైన బంగ్లా ఉంది. ఇది రూ.30 కోట్లతో నిర్మించినట్లు సమాచారం. ఇక విలాసవంతమైన కార్లు ఆయన గ్యారేజీలో చాలా ఉన్నాయి.

అందుకే అప్పట్లో మెగాస్టార్.. బిగ్గర్ దేన్ బచ్చన్ అని అనేవారు. మెగాస్టార్ ‘ఆపద్బాంధవుడు’ చిత్రానికి అత్యధికంగా ₹1.25 కోట్ల రెమ్యునరేషన్ ను తీసుకున్నారు. ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా కొన్ని నేషనల్ మ్యాగజైన్స్ చిరంజీవి కవర్ పేజీని ముద్రించాయి. ‘బిగ్గర్ దేన్ బచ్చన్’, ‘ది న్యూ మనీ మెషిన్’ అంటూ కీర్తించాయి. ఇప్పటి వరకూ అన్ని భాషల్లో కలిపి 155 సినిమాల్లో మెగాస్టార్ నటించారు.
Also Read:మెగా157 అనౌన్స్ మెంట్

- Advertisement -