నిత్యశ్రామికులకీ మేడే శుభాకాంక్షలు: చిరు

182
chiru
- Advertisement -

మేడే సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి నిత్య శ్రామికులంద‌రికి త‌న సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అందరికీ మేడే శుభాకాంక్షలు! కష్టే ఫలి అనేది మన నానుడి.మనం పడే కష్టమే మనకి నిజమైన ప్రతిఫలాన్ని అందచేస్తుంది. నేను కూడా ఎప్పుడూ నమ్మే సిద్ధాంతం. శ్రమైక సౌందర్యాన్ని గుర్తుచేసే ఈ రోజున ప్రపంచంలోని నిత్య శ్రామికులందరికీ వందనాలు,అభివందనాలు! Happy #MayDay ! అని పేర్కొన్నారు చిరంజీవి.

ప్రస్తుతం చిరంజీవి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆచార్య అనే సినిమాలో న‌టిస్తుండ‌గా కొరటాల శివ తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌ సరసన కాజ‌ల్ అగ‌ర్వాల్, పూజా హెగ్డే ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు.

- Advertisement -