అశ్విన్ ఇంట్లో కరోనా కలకలం…!

59
ashwin

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చుతోంది. కరోనాతో ఐపీఎల్ నిర్వహణ సందిగ్దంగా మారగా రవిచంద్రన్ అశ్విన్ ఇంట్లో కరోనా కల్లోలం సృష్టించింది. అశ్విన్ ఇంట్లో ఏకంగా 10 మందికి కరోనా సోకింది.

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు అశ్విన్ భార్య ప్రీతి. ఒకే వారంలో ఇంట్లోని ఆరుగురు పెద్దవాళ్ళు, నలుగురు పిల్లలకు పాజిటివ్ గా తేలిందని… పిల్లల వల్ల అందరికీ కరోనా సోకిందని వెల్లడించింది.

ఇప్పటికే ఐపీఎల్ 2021 టోర్నీ నుంచి విరామం తీసుకుంటున్నట్లు అశ్విన్ ప్రకటించిన విషయం తెలిసిందే.