మహేష్… మహర్షి కాన్సెప్ట్ అదుర్స్‌:చిరంజీవి

347
chiru maharshi

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25వ చిత్రం మహర్షి. ప్రపంచవ్యాప్తంగా నిన్న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం మహేష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను రాబట్టి గత రికార్డులను తిరగరాస్తోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మహర్షి మూవీ కాన్సెప్ట్‌కు ఫిదా అయిపోయింది.

మహర్షి సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ప్రశసలు గుప్పించారని చెప్పారు దర్శకుడు వంశీ పైడిపల్లి. సినిమా గురించి 5 నిమిషాలు మాట్లాడారని అది ఎప్పటికి మర్చిపోలేని అనుభూతి అన్నారు. చిరంజీవిని చూసి పెరిగామని ఆయన్ని ఆరాధించామని అలాంటి మెగాస్టార్ ఫోన్ చేసి విషెస్ చెప్పడం ఎప్పటికి గుర్తుండి పోతుందన్నారు. సరిగ్గా మే9 మహర్షి విడుదల రోజే చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి విడుదలైందని రెండు సినిమాలు ఇండస్ట్రీ ఆల్ టైమ్‌ హిట్‌గా నిలవడం ఆనందంగా ఉందన్నారు. మంచి సినిమా తీస్తే ఇండస్ట్రీ మొత్తం ఆరాధిస్తుందనడానికి ఇదే సంకేతామని అదే టాలీవుడ్ ప్రత్యేకత అన్నారు.

వీకెండ్ అగ్రికల్చర్,స్కూల్స్‌లో అగ్రికల్చర్ పాయింట్ అద్భుతంగా ఉందని చిరంజీవి చెప్పారని తెలిపారు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ చిరంజీవి. వారానికి లేదా నెలకొసారైన పిల్లలకు వ్యవసాయంపై అవగాహన కల్పించాలని సూచించారని గుర్తు చేశారు.

ఇక ప్రపంచవ్యాప్తంగా 66 కోట్ల షేర్ రాబట్టిన మహర్షి నాన్ బాహుబలి 2 రికార్డులను సైతం తిరగరాసింది. ఈ వీకెండ్‌లో మరిన్ని వసూళ్లు రాబట్టి టాలీవుడ్ రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.