యూకే డిప్యూటీ హై కమిషనర్ గారెత్ వైన్ ఓవెన్ మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా సందర్శించారు. ఈ సందర్భంగా బ్రిటన్, భారత్‌కు సంబంధించిన పలు అంశాలపై ఇరుపక్షాలు చర్చించాయి. తెలుగు మాట్లాడే దేశాలతో బ్రిటన్ సంబంధాల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. మర్యాదపూర్వకంగా కలిసిన ఫొటోను మెగాస్టార్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటివరకు డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్‌గా వ్యవహరించారు. ఫ్లెమింగ్ పదవీకాలం జులైలో ముగియగా, ఆయన స్థానంలో గారెత్ విన్ ఓవెన్ నూతన బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గా నియమితులైన సంగతి తెలిసిందే.
బ్రిటన్ నూతన డిప్యూటీ కమిషనర్‌తో భేటీ కావడం ఆనందంగా ఉందన్నారు చిరంజీవి. నా నివాసంలో ఆయనకు కొన్ని తెలుగు సంప్రదాయ వంటకాలతో విందు ఏర్పాటు చేశాను. నోరూరించే ఆవకాయ కూడా రుచి చూశారు’ అంటూ చిరు పేర్కొన్నారు. భేటికి సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి.