చాతనైతే సీపీఎస్‌ను రద్దు చేయి:టీఎస్‌యుటీఎఫ్

194
- Advertisement -

ఉద్యోగులు, ఉపాధ్యాయులు వాళ్ళ ప్రమోషన్లు, బదిలీల కోసం పైరవీలు చేసుకుంటారంటూ అవమానకరంగా మాట్లాడటాన్ని టిఎస్ యుటిఎఫ్ తీవ్రంగా ఖండిస్తున్నది. ఉద్యోగులు, ఉపాధ్యాయులపై నోరు పారేసుకునే బదులు ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలపై పోరాడాలని హితవు పలికారు.

బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి లేదా పోట్లాడి వారి పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రవేశ పెట్టిన, గత 18 సంవత్సరాలుగా ఉద్యోగుల కుటుంబాల సామాజిక భద్రతకు ముప్పుగా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ పునరిద్దరించాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి డిమాండ్ చేశారు.

భావోద్వేగాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య ఐక్యతకు చిచ్చు రేపుతున్న కేంద్ర పాలకులు పసి మెదళ్ళను కలుషితం చేయడానికి పథకం ప్రకారం జాతీయ విద్యా విధానం 2020 ని అమలు జరుపుతున్నదని విమర్శించారు. బండి సంజయ్ చాతనైతే ఎన్ఈపి రద్దుకు కృషి చేయాలని కోరారు.

ఎన్ఈపి రద్దు చేయాలని, సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న క్యాంపైన్ లో భాగంగా నవంబర్ 17, 18 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఇవి కూడా చదవండి..

మానవత్వం చాటుకున్న మంత్రి కేటీఆర్

నవంబర్ 18న అలిపిరికి అల్లంత దూరం

మునుగోడులో బీజేపీ గుండాయిజం..టీఆర్‌ఎస్‌పై దాడి

- Advertisement -