మెగాస్టార్ చిరంజీవి ఇటివలే సైరా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. సురెందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈసినిమా చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించిన ఈమూవీలో అమితాబ్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నాలు కీలకపాత్రలో నటించారు. కాగా చిరంజీవి తర్వాతి మూవీ కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముగింపు దశకు చేరుకుంది. త్వరలోనే ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానుంది.
దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వలన సమాజంపై ఎంత చెడు ప్రభావం చూపుతాయనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఇందులో చిరంజీవి.. దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఇక ఈమూవీలో లేడీ అమితాబ్ విజయశాంతి కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తుంది. చిరు సరసన హీరోయిన్ గా త్రిషను ఖరారు చేశారు. ఇప్పటి వరకు కొరటాల శివ చేసిన అన్నీ సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం వహించారు. కానీ ఈమూవీకి ఇతర సంగీత దర్శకుల వైపు చూస్తున్నారు కొరటాల. మొదట బాలీవుడ్ దర్శకుల వైపు చూసిన చివరగా మణిశర్మను ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.