చెరువులు నింపాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం..

440
jagadish reddy

సూర్యాపేట జిల్లాలోని చెరువులన్ని నీటితో కళకళలాడలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.అందుకు అనుగుణంగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి చర్యలు తీసుకోవాలని నీటిపారుదల అధికారులను ఆయన ఆదేశించారు.

మంగళవారం రోజున సూర్యపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నీటిపారుదల,శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ అధికారులతో పాటు ఎన్ యస్ పి అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. గోదావరి జలాలు మంత్రి జగదీష్ రెడ్డి అభిస్టం మేరకు ఆపేది లేదంటూ ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపద్యంలో జరిగిన ఈ సమీక్ష సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

మండలాల వారీగా విచారించిన ఆయన ఇప్పటి వరకు నిండిన చెరువులు…. నిండుతున్న చెరువులు తో పాటు నింపాల్సిన చెరువుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.చివరి ఎకరం వరకు నీళ్లు ఇస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను వాకబు చేయాలన్నారు.మూసి ఆయకట్టు కు నీటి విడుదల విషయంలో అంతిమంగా రైతుల అభిస్టం మేరకు వదిలాలన్నారు.త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఉమ్మడి నల్గొండ జిల్లా నీటి పారుదల పై సమీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటి వరకు సూర్యపేట జిల్లాలో గోదావరి జలాలతో 191 చెరువులు నిండగా మరో 124 చెరువులు పురోగతి లో ఉన్నట్లు అధికారులు మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.

అంతే గాకుండా మరో 59 చెరువులు నింపాల్సి ఉందని అధికారులు మంత్రికి వివరించారు.యస్ ఆర్ యస్ పి కింద ఉన్న డి బి యం 69,70,71ల పరిధిలో ఉన్న చెరువుల తో పాటు టెల్ ఎండ్ కాకతీయ మెయిన్ కెనాల్ కాలువలపై ఆయన సమీక్షించారు. గతంలో తవ్విన కాలువలు నిరుపయోగంగా మారాయి అంటూ తుంగతుర్తి శాసనసభ్యులు గాధారి కిశోర్ కుమార్ మంత్రి జగదీష్ దృష్టి కి తీసుకరాగా ఆయన తీవ్రంగా స్పందించారు. డిజైన్ ల ప్రకారం అప్పుడు కాలువలు తవ్వ లేదన్నారు.అవన్నీ కూడా కేవలం మొక్కుబడిగా తవ్వి బిల్లులు ఎత్తుకున్నారని ఆయన చెప్పారు.ఆ మాటకు వస్తే అసలు నీళ్లు ఇచ్చే ఉద్దేశమే గత ప్రభుత్వాలకు లేదన్నారు.ఉంటే ఇప్పుడు చెరువులు నింపేందుకు ఇంతటి ఇబ్బంది ఉండేది కాదన్నారు.అటువంటి అవాంతరాలను అధిగమించి జిల్లాలో చెరువులు అన్ని నింపుతున్నామని,నింపుతామని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.

తుంగతుర్తి నియోజకవర్గంలో చెరువుల నింపకం ప్రస్తావన కు వచ్చినప్పుడు స్థానిక శాసనసభ్యులు గాధారి కిశోర్ కుమార్ గ్రామాల వారీగా అడిగి తెలుసు కోవడం తో పాటు అధికారుల నిర్లిప్తత మూలంగా రైతాంగం పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కలెక్టర్ అమయ్ కుమార్ ,జాయింట్ కలెక్టర్ సంజీవ్ రెడ్డి ,ఆర్ డి ఓ మోహన్ రావు నీటి పారుదల అధికారులు హమీద్ ఖాన్ ,సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

Guntakandla Jagadish Reddy is an Indian politician and present MLA for Suryapet. He has served as Minister of Energy in Telangana since 2019.